← Back to list

TITLE: సోగసరి సొగ్గాడు

హైదరాబాద్‌లోని ఒక MNCలో హీరో, హీరోయిన్ కలిసి పని చేస్తుంటారు. మొదటి నుంచే ఇద్దరికీ ఒకరిపై ఒకరికి సరైన అర్ధం ఉండదు. చిన్న చిన్న విషయాలకే…

Jeswanth Duggasani · 2026-05-04 15:17 · 0 claps · 0.8 min read
#love #relationships #telugucinema
Open on Medium ↗
Wiki topics: 💑 · Relationships 🎬 · Film & Television

TITLE:

సోగసరి సొగ్గాడు

హైదరాబాద్‌లోని ఒక MNCలో హీరో, హీరోయిన్ కలిసి పని చేస్తుంటారు. మొదటి నుంచే ఇద్దరికీ ఒకరిపై ఒకరికి సరైన అర్ధం ఉండదు. చిన్న చిన్న విషయాలకే గొడవపడుతూ, టామ్ అండ్ జెర్రీలా రోజులు గడుపుతుంటాయి. ఒక రోజు అనుకోకుండా హీరో తన ఊరికి వెళ్లాల్సి వస్తుంది. మొదట్లో హీరోయిన్‌కు ఇది ఆనందంగా అనిపించినా, కొన్ని రోజుల తర్వాత ఆమెకు హీరోని మిస్ అవుతున్న భావన కలుగుతుంది. అదే సమయంలో హీరో కూడా తన ఊర్లో హీరోయిన్‌ని గుర్తుచేసుకుంటూ ఉంటాడు. అలా ఇద్దరూ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను అర్ధం చేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత హీరో తిరిగి ఆఫీస్‌కి వస్తాడు. హీరోయిన్ తన భావాలను బయటపెట్టకుండా సాధారణంగా ప్రవర్తించినా, లోపల చాలా సంతోషంగా ఉంటుంది. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా, ఈగో కారణంగా ఎవరూ ముందుకు వచ్చి చెప్పరు. ఒక రోజు హీరోయిన్ తండ్రి ఆమె పెళ్లి విషయంపై మాట్లాడటానికి ఆఫీస్‌కి వస్తాడు. ఆ విషయం విని హీరో చాలా బాధపడతాడు మరియు ఎలాగైనా తన మనసులోని మాట చెప్పాలని నిర్ణయించుకుంటాడు. కానీ అక్కడికి వెళ్లి చూస్తే, ఆ వ్యక్తి తన మామయ్య అని తెలుస్తుంది. హీరోయిన్ తండ్రి "రా అల్లుడు రా" అని పిలిచినప్పుడు హీరోయిన్ షాక్ అవుతుంది. ఇంటర్వెల్ తర్వాత కథలో ట్విస్ట్ – హీరో, హీరోయిన్ బావ-మర్దలు అని తెలుస్తుంది. ఆ విషయం తెలిసిన తర్వాత వారి ప్రేమ ఇంకా బలపడుతుంది. వారి మధ్య చిన్న చిన్న సరదా గొడవలు, బావ-మర్దల సన్నివేశాలు కథను హ్యాపీగా ముందుకు తీసుకెళ్తాయి. కానీ పెళ్లి విషయానికి వస్తే హీరో తల్లి ఒప్పుకోదు. కారణం – బావ మర్దలు ఒకే రక్త సంబంధం కాబట్టి భవిష్యత్తులో పిల్లలపై ప్రభావం ఉంటుందని ఆమెకు భయం. ఈ సమస్యను వారు ఎలా ఎదుర్కొన్నారు? హీరో తల్లిని ఎలా ఒప్పించారు? చివరికి వారి ప్రేమ గెలిచిందా? లేక కుటుంబం కోసం వారు త్యాగం చేశారా? అనేది ఈ కథ యొక్క మిగతా భాగం.


메타데이터
post_id
04ffa937dd5b
slug
title-సోగసరి-సొగ్గాడు-04ffa937dd5b
url
https://medium.com/@jeswanthduggasani/title-%E0%B0%B8%E0%B1%8B%E0%B0%97%E0%B0%B8%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%B8%E0%B1%8A%E0%B0%97%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81-04ffa937dd5b
canonical_url
https://medium.com/@jeswanthduggasani/title-%E0%B0%B8%E0%B1%8B%E0%B0%97%E0%B0%B8%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%B8%E0%B1%8A%E0%B0%97%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81-04ffa937dd5b
author_url
https://medium.com/@jeswanthduggasani
status
ok
fetched_at
2026-06-09 15:37:30