Fire Accident : యాదాద్రి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
Fire Accident : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం…
Fire Accident : యాదాద్రి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
Fire Accident : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. మొదటి యూనిట్‌లోని బాయిలర్ వద్ద ఆయిల్ లీక్ కావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అక్కడ వెల్డింగ్ పనులు జరుగుతుండటంతో లీకైన ఆయిల్‌కు మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగి యూనిట్ మొత్తానికి వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడి పరిసర ప్రాంతాల్లో ఆందోళన ఏర్పడింది. కార్మికులు వెంటనే అప్రమత్తమై భద్రతా చర్యలు చేపట్టారు. ప్లాంట్ సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాదంపై అలర్ట్ అయిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
https://vaartha.com/major-fire-accident-at-yadadri-power-plant/telangana/479619/
메타데이터
- post_id
- 8ea49bd2dbd6
- slug
- fire-accident-యాదాద్రి-పవర్-ప్లాంట్-లో-భారీ-అగ్నిప్రమాదం-8ea49bd2dbd6
- url
- https://medium.com/@vaarthadaily/fire-accident-%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B1%80-%E0%B0%85%E0%B0%97%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A6%E0%B0%82-8ea49bd2dbd6
- canonical_url

- author_url
- https://medium.com/@vaarthadaily
- status
- ok
- fetched_at
- 2026-08-03 07:44:41